Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘట్కేసర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య
నవతెలంగాణ-ఘట్కేసర్
స్వచ్ఛ ఘట్కేసర్ లక్ష్యంగా ముందుకు వెళ్లాలని చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాల్టీ కార్యాలయంలో శుక్రవారం బడ్జెట్ సమావేశం చైర్పర్సన్ అధ్యక్షతన జరిపారు. 2023-24 సంవత్సర సాధారణ అంచనా నిధులు చర్చించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. 2023-24 సంవ త్సర సాధా రణ అంచనా నిధులు రూ. 12 కోట్ల 60 లక్షల నిధులను కేటాయించుకోవడం జరిగిందన్నారు. ఆ నిధుల ను ఘట్కే సర్ మున్సిపాల్టీలోని కార్మికుల వేతనాలకు, కరెంటు బిల్లు లకు ఉపయోగించేందుకు అని తెలుపుతూ ఘట్కేసర్ సాధారణ మెయింటనెన్స్, అదేవిధంగా అన్ని వార్డుల అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు పారదర్శక పాలన, మెరుగైన మౌలిక సదుపాయలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసి అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని దిశానిర్థేశం చేశారు. ప్రతీ రెండు వార్డులకు ఒక చెత్త సేక రణ వాహనాన్ని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచిం చారు. మున్సిపల్ పరిధిలో ప్రజలకు అవసరమైన తాగు నీరు, భూగర్భ డ్రయినేజీ, విద్యుత్ ఇతర సమస్యలు లేకుం డా చూడాలని సూచిం చారు. సీసీ, బీటి రోడ్లు, డ్రయినేజీ మొదలైన మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టా లన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ పలు గుల మాధవరెడ్డి కమిషనర్ వేమన రెడ్డి కౌన్సిలర్లు చందు పట్ల వెంకట్ రెడ్డి, కొమ్మగోని రమాదేవి, బొక్క సంగీత, బండారు ఆంజనే యులు , కొమ్మిడి అనురాధ సల్లూరి నాగజ్యోతి, చిలుగురి హేమలత, బర్ల శశికళ , కడుపొల్ల మల్లేష్ , జహంగీర్ , బేత ల నర్సింగ్, కుతాది రవీందర్ , కో-ఆప్షన్ సభ్యులు పల్లె అరుణ , బొక్క సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.