Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల బాధ్యతా రాహిత్యంతో సమస్యలకు నెలవుగా బోడుప్పల్
- కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాలో బీఆర్ఎస్ కార్పొరేటర్ వెంకటేష్
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తీర్మానాలు చేసిన పనులను పూర్తి చేయకుండా అధికారులు తత్సారం చేయాడం వల్ల అభివద్ధి కుంటుపడిపోయిందని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్ మండిపడ్డారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం రాసాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నాడు దేశ వ్యాప్తంగా ఖ్యాతిని గడిస్తే నేడు అధికారుల తీరుతో పథకాల ఊసే లేకుండా పోయిందని అన్నారు. కార్పొరేషన్ లో ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే దర్శనం ఇస్తున్నాయని తెలిపారు. ప్రధాన రహదారుల వెంట ప్రయాణం చేయాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. మూడేండ్ల క్రితం తీర్మానాలు చేస్తే పనులు చేయకుండా అధికారులు తాత్సారం చేయాడం వల్ల తమ పాలక వర్గానికి, మంత్రికి చెడ్డపేరు వస్తుందని ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకుని ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన ప్రతి రూపాయిని ప్రజా అవసరాలకే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్ అలూరి వాణికి వినతిపత్రం అందించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయ కులు వారి పడతం లోకేష్,కె.రాంచందర్ యాదవ్, వెంక ట్రావు, కృష్ణరెడ్డి, సురేందర్ రెడ్డి, కామగళ్ల నరసింహలతో పాటు కార్పొరేషన్ కు చెందిన వివిధ కాలనీల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు..
కార్పొరేషన్లోని అన్ని డివిజన్ల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా కూడా కొందరు కావాలనే రాద్ధాం తం చేస్తున్నారని మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్లు అన్నారు. గత ఫిబ్ర వరి నెలలో రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేయాల్సి ఉండగా ఎమ్మె ల్సీ ఎన్నికల కోడ్ ఉండడం అదే విధంగా కమిషనర్ మార్పు ల కారణంగా కొద్దిగా ఆలస్యం అయ్యిందన్నారు. ఈ రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో రొడ్డు మరమ్మత్తుల కోసం అవసరమైన బడ్జెట్ కేటాయింపు చేసేందుకు గాను తీర్మానాలు చేసి పనులను త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించినట్టు తెలిపారు.