Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
పోచారం మున్సిపల్ బడ్జెట్ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన జరి పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 21,33, 69,000 ల అంచనా ఆదాయంతో రూ. 20,77,65,000 అంచనా వ్యయంతో, రూ. 56,04,000 ముగింపు నిలువతో తయారుచేసిన ముసాయిదా బడ్జెట్‌ను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈముసాయిదా బడ్జెట్‌ను చైర్ పర్సన్ బోయపల్లి కొండల్ రెడ్డి ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు, ఆప్షన్ సభ్యులు ప్రతీ అంశాన్ని చర్చించి, బడ్జె ట్లో గానీ రెవెన్యూ ఆదాయం రూ. 18 కోట్ల 53 లక్షలలో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కింద 1.85,39,000 కేటాయిస్తూ, నూతనంగా విలీనమైన ప్రదేశాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికిగాను బడ్జెట్లో 1/3 ( 3వ వంతు రూ.2,44,51,000)లు కేటాయిస్తూ, పురపాలక సంఘంలో మౌలిక వసతులు కల్పన అభివద్ధి పనులకు మొత్తం రూ. 9,22,04,000 లు కేటాయిస్తూ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఆదర్శవంతమైన బడ్జెట్ ను రూపకల్పన చేసి ప్రవేశపెట్టిన ముసాయిదా బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమో దిస్తూ తీర్మానం చేశారు. ఇట్టి బడ్జెట్ సమావేశంలో సభ్యుల ందరూ తమ వంతు బాధ్యతగా క్రమశిక్షణతో చర్చలో పాల్గొని మున్సిపాల్టీ అభివద్ధికి పెద్దపీట వేస్తూ, మౌలిక వసతుల కల్పన అభివద్ధి ధ్యేయంగా సమావేశాన్ని విజయ వంతం చేసినందుకు ముసాయిదా బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు చైర్మెన్, కమిషనర్ కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సురేష్, వైస్ చైర్మెన్ రెడ్డియా నాయక్ , కౌన్సిల్ సభ్యులు గొంగళ్ల మహేష్ నర్రి ధనలక్ష్మి, చింతల రాజశేఖర్, ఆకిటి శైలజ, బైర హిమ, బాలగోని వెంకటేష్ గౌడ్, నల్లవెల్లి లక్ష్మి, బెజ్జం కి హరిప్రసాదరావు, సామల శ్రీలత, సుర్వి రవీందర్, అభవతిని సరిత, మోటుపల్లి పోచమ్మ, సుర్విసుదాలక్ష్మి, బద్దం మమతారాణి, కోఆప్షన్ సభ్యులు దాసరి శంకర్, అక్రమ్ అలీ మహమ్మద్, మున్సిపల్ ఏఈ కె నరేష్ కుమార్, మేనేజర్ టీ నర్సింలు, అకౌంటెంట్ ముని మహమ్మద్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.