Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
2023 - 24 ఆర్ధిక సంవత్సరానికి మీర్ పేట్ మున్సి పల్ కార్పోరేషన్ వార్షిక బడ్జెట్ సమావేశం మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం అయిన వెంటనే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు.. పెంచిన ఇంటి పన్నులు నీటి బిల్లుల తగ్గించాలని, రెంటు వైర్ల సమస్యలు, వీధి కుక్కలను కట్టడి చేయడంలో, అక్రమ నిర్మాణాలు జరిగితే అపరాధ రుసుం విధించటంలో, కౌన్సిల్ మీటింగ్ నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పోడియం ముందు ఆందోళన చేపట్టారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను అందులో చర్చిద్దాం.. ప్రస్తుతానికి బడ్జెట్ సమావేశం సాగనివ్వండి అని కార్పొరేటర్లకు చెప్పారు. అయినా వినకపోవడంతో మేయర్, అడిషనల్ కలెక్టర్ సమావేశం నుంచి వెళి ్లపోయారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం ముందు దాదాపు రెండు గంటల వరకు నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారం రోజుల్లో సమస్యల పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా మేయర్ లేకుండానే రూ. 77 కోట్ల 71 లక్షల అంచనాతో బడ్జెట్‌ను అకౌంటెంట్ ప్రవేశపెట్టారు.
మరోవైపు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిష నర్ నాగేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. బీజేపీ ప్లోర్ లీడర్ కీసర గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ చల్లా కవిత బాల్ రెడ్డి, బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జి అందేలా శ్రీరాములు యాదవ్, బీజేపీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.