Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ-మీర్ పేట్
పారిశుధ్య కార్మికులకు భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ బాలాపూర్ మండల నాయకులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ బాలాపూర్ మండల కన్వీనర్ పెంటయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య కార్మికులు ఎన్నో ఏండ్లు గా పనిచేస్తున్నారని ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాం టి ఇన్సూరెన్స్ సౌకర్యం, భద్రత కల్పించలేదన్నారు. ఇప్పటి వరకు దాదాపు 20 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు. కార్మికులపై ఆధారపడిన కుటుంబాలకు అధికా రులు దహన సంస్కారాల కోసం కేవలం రూ 10వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుం టున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు దాసరి బాబు తదితరులు పాల్గొన్నారు.