Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ అరుణ సురేందర్
నవతెలంగాణ-నాగోల్
ఎటువంటి మానసిక ఒత్తిళ్లకు లోను కాకుండా ప్రశాంత మనసుతో పరీక్షలు రాసి లక్ష్యాన్ని చేరుకోవా లని నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్ యాదవులు పదో తరగతి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నాగోలు ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు హాల్టికెట్లు, పరీక్ష ఫ్యాడ్లను పెన్నులను వారు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం చదువుతూ సమయ పాలన పాటించాలని తెలిపారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. నిద్రాహారాలు మాని సమ యానికి భోజనం చేయకుండా ఉండి మానసి ఒత్తిళ్లకు గురికాకుడదని చెప్పారు. మంచి మార్కులను సాధించి పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరుకు తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు ,విద్యార్థులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.