Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
ఇటీవల విజయవాడ జాతీయ రహదారి ఇరువైపుల చింతల కుంట చెక్ పోస్ట్ నుంచి కొత్త గూడ జంక్షన్ వరకు రోడ్ విస్తరణలో 142 తాటి, ఈత చెట్ల నరికివేతకు నష్టపరి హారంగా ఆర్అండ్బీ శాఖ, ఎక్సైజ్ శాఖ కలిసి కల్లు గీత సోసైటీకి రూ. 1,39,728 చెక్కులను సరూర్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు, హయత్ నగర్ తహసీల్దార్ సంధ్యా రాణిలు శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో సొసైటీ లక్ష ఈత, తాటి చెట్లు నాటాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ స్వచ్ఛ మైన కల్లును అందించే రాష్టంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ గౌడ్, ఎస్ఐలు సరళ, వెంకన్న, భాస్కర్, రవీందర్ రెడ్డి లు పాల్గొన్నారు.