Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సరూర్ నగర్
తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా టేకుల మంజులా రెడ్డి నియామ కమ య్యారు. ఈ మేరకు శుక్రవారం సమితి గౌరవ సలహాదా రుడు శీలం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బాలు యాదవ్, అనుబంధ రంగాల కార్యదర్శి నగేష్ యాదవ్‌ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని వారు అందుకున్నారు. ఈ సందర్భంగా మంజుల రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని నెల లుగా సమితి రాష్ట్ర కార్యదర్శిగా చేస్తున్న సేవలను గుర్తించి అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం మరింత బాధ్యత పెంచిం దన్నారు. నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞ తలు తెలిపారు. రైతు మహిళల్లో చైతన్యం తీసుకొస్తానని, రాష్ట్రస్థాయి రైతు మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారికి చేయూతనిస్తానని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళలని సంఘటితం చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బాలు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పత్తి రైతుల సమస్యలపై పోరాటం, రైతు బంధు పథకాన్ని కౌలుదా రులకు కూడా వర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు, గ్రామీణ వాతావరణంలో మహిళలు గ్యాస్ సిలిండర్ వాడడం వలన రోజుకు 30 రూపాయలు ఖర్చు అవుతుం డడంతో కట్టెలపోయే వాడు తుండడంతో అనారోగ్యాల పాలవుతున్నారని గ్రామీణ ప్రాం త మహిళలకు గ్యాస్ బండపై 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన పోరాటాలను గుర్తించి అధ్యక్షురా లుగా నియమించడం జరిగిందని తెలిపారు.