Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాచకొండ సీపీ డి.ఎస్ చౌహాన్
నవతెలంగాణ-హయత్ నగర్
త్వరలో జరుగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్బీనగర్ లోని కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. శాంతియుతంగా ఊరేగింపులు జరుపుకోవాలని, పోలీసు లతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. రాచకొండ పరిధిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియు తంగా వేడుకలు జరుపుకోవాలని, పోలీసులకు సహకరిం చాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో ఎల్ బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి, హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు శివరాం, శశిధర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.