Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌్ డా.ఎం.సత్యనారాయణ
- అవగాహన కార్యక్రమాలు విజయవంతం
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో ఎన్నో ప్రముఖ పట్టణాలల్లో ఇప్పటీ నీటి కొరత ఉందని, వివిధ ప్రాంతాలల్లో నీళ్లు లేక ప్రజలు అల్లాడుతున్నారని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.సత్యనారాయణ తెలి పారు. జలమండలి ఎంతో ప్రయాసతో సుదూర ప్రాంతాల నుంచి తరలిస్తున్న ప్రతీ నీటి చక్కా విలువైందని, నీటిని వథా చేయవద్దని కోరారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా జలమండలి మార్చి 22 నుంచి 31 వరకు నీటి వథా అరికట్టడం, దాని విలువ, ప్రాము ఖ్యతను తెలిపేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రదేశాలు, పాఠశాలలు, కమ్యూ నిటీ సెంటర్లలో నిర్వహించిన అవగాహన కార్యాక్రమాల్లో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డెరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ రవికుమార్, స్వామీ, ఓఎస్డీలు సత్యనారాయణ, మనోహరాచారితోపాటు తదితర అధికారులు పాల్గొని విజయవం తం చేశారు. అయితే ఈ వేడుకలు శుక్రవారంతో ముగియడంతో జూబ్లీహిల్స్‌లోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్కులో ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.సత్యనారాయణ, బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ నీటి సంరక్షణకు జలమండలి ఆరేండ్లుగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోం దన్నారు. ఏటా నీటి దినోత్సవం జరప డంతో పాటు జల భాగ్యం, జలం-జీవం, వాక్ వంటి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. అవగాహన కార్యక్రమాల వల్ల ప్రజలకు నీటి ప్రాముఖ్యతను తెలియజెప్పామన్నారు. ఇందులో వివిధ స్వచ్ఛంద సంస్థలను సైతం భాగస్వామ్యం చేశామని తెలిపారు. అనంతరం నీటి సంరక్షణ కోసం పనిచేసిన పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో పాటు శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు.