Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో నేటి నుంచి ఐపీఎల్ సందడి మొదలు కానుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఉప్పల్ వేదికగా మొత్తం ఏడు మ్యాచుల్లో ఆడనున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రద్దీ నేపథ్యంలో నాగోల్-అమీర్ పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్టు మెట్రో ఎండీ ఎన్వీఎస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. మరో వైపు ఉప్పల్ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.