Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం సీఐగా బాధ్యతలు స్వీకరించిన డి.జలంధర్ రెడ్డిని, ఇక్కడి నుంచి సాధారణ బదిలీపై సీసీఎస్ మల్కా జ్గిరి విభాగ సీఐగా శనివారం బాధ్యతలు స్వీకరిస్తున్న కే.సత్యనారాయణను వనస్థలిపురంకి చెందిన ఎంఎస్ఆర్ యూత్ ఫోర్స్ అధ్యక్షులు మిట్టకంటి సత్తిరెడ్డి తన సభ్యులతో కలిసి శాలువా కప్పి బొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ వనస్థలిపురం సీఐగా కె.సత్యనారాయణ వనస్థలిపురంవాసుల అభిమా నాన్ని కైవసం చేసుకున్నారని, సత్యనారాయణ ఎక్కడ విధులు నిర్వహించినా ఆ ప్రాంతం చట్టానికి లోబడి ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ ఆర్ యూత్ ఫోర్స్ సభ్యులు సంగ్రామ్, శివ, ఉదరు, వెంకట్, ప్రసాద్, బాబి తదితరులు పాల్గొన్నారు.