Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోనల్ కమిషనర్ పంకజం
నవతెలంగాణ-ఎల్బీనగర్
ఆర్థిక సంవత్సరం 2022 - 2023లో జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూలులో ఎల్.బి.నగర్ జోన్ మూడో స్థానంలో నిలిచింది. ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని ఐదు సర్కిల్స్ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు, రెవిన్యూ అధికారులు కలిసి ఆస్తి పన్ను వసూలులో నగరంలోనే ముందు ఉన్నారు. జోనల్ కమిషనర్ పంకజం ఆస్తి పన్ను వసూలు లో అగ్ర స్థానం సంపాదించారు. ఎల్బీనగర్ జోన్లో పేరుకుపోయిన ఆస్తి పన్నును రాబట్టారు. జోనల్ కమిషనర్ పంకజం ఆస్తి పన్ను వసూలు చేయడంలో సిబ్బంది టార్గెట్స్ ఇచ్చి ఇంటింటికీ వెళ్లి వసూలు చేయాలని అధికారులను అదేశించారు. ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తిచేసి ఎల్బీనగర్ జోన్‌కు మంచి పేరు తీసుకొచ్చిన సిబ్బందిని, అధికారులను, జోనల్ కమిషనర్ పంకజం అభినందించారు.