Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
నవతెలంగాణ-వనస్థలిపురం
అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ గేట్ చార్జీలు, డీజిల్ పెరుగుదలకు నిరసనగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆటోనగర్ వద్ద ఆటోనగర్ ఇసుక లారీల అడ్డా అధ్యక్షుడు కేసారం బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన వెలువ్వకు తెలంగాణ స్టేట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోస ియేషన్ అధ్యక్షుడు నందా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని శనివారం జాతీయ రహదారిపై ప్లే కార్డ్స్‌తో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నందా రెడ్డి మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం 8 నుంచి 15% టోల్ గేట్ చార్జీలు పెంచిందని, ఈ ఏడాది రేట్లు కార్లు, జీపులకు అదనంగా ఐదు నుంచి పది వరకు, బస్సులు, లారీలకు 15 నుంచి 25 వరకు, భారీ వాహనాలకు 40 నుంచి 50 వరకు అదనంగా టోల్ చార్జీలను పెంచి అధిక భారం మోపిందన్నారు.
జీఎస్టీ బరిలోకి డీజిల్‌ని ప్రవేశపెట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువులతో పాటు ప్రజలకు అధిక భారం మోపి, ప్రభుత్వపరమైన వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు యాదగిరి గౌడ్, బాల్‌రెడ్డి, రాజాగౌడ్, శ్రీనివాస్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.