Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.80కోట్ల 30లక్షల 87వేల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తున్నామని మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 2023-24 సంత్సరం వార్షిక బడ్జెట్ సమావేశం మేయర్ పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ బడ్జెట్ సమావేశంలో వివిధ అంశాల వారిగా సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను కార్పొరేటర్ల సమక్షంలో ఏకాభిప్రాయంతో బడ్జెట్‌కు తీర్మానం చేసి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడు తూ 2023-24సంవత్సరంకు గాను రూ.80కోట్ల 30లక్షల 87వేల వివిధ అభివృద్ధి పనులను పూర్తిచేయటానికి కౌన్సిల్ తీర్మానం చేయటం జరిగిందన్నారు. అందులో ప్రస్తుతం రూ.23కోట్ల 91లక్షల మిగులు బడ్జెట్ ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎస్ఎన్డిపి నిధులతో వరద కాలువల నిర్మాణ పనులకు చేయుటకు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిలు అట్టహాసంగా శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయక పోవటం వలన కాంట్రాక్టర్ నాలా నిర్మాణ పనులను పూర్తి చేయకపోవటంతో అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సరం ఎస్ఎన్డిపి వరద కాల్వల నిర్మాణ పనులకు ప్రత్యేకంగా రూ.18 కోట్ల నిధులు కేటాయించి దశల వారీగా పనులు పూర్తి చేయుటకు రూ.1 కోటి చెల్లించటం జరిగిందని, అందుకు సభ ఆమోదం తెలిపిందన్నారు. అప్పటి నుంచి కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ఈ సంవత్సరం ఎస్ఎన్డిపి పనులకు ప్రత్యేకంగా అంచనా నిధులను సుమారు రూ.44 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని, మేయర్ సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఅప్షన్ సభ్యులు, డీఈఈలు అశోక్ రెడ్డి, జ్యోతి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.