Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల నిర్వాకం
- స్థానికుల ఆగ్రహం
నవతెలంగాణ-కాప్రా
ఎంతో ఆదర్శంగా ఉండవలసిన కాప్రా సర్కిల్ కార్యాల యం కొంతమంది సిబ్బంది వల్ల అసాంఘిక శక్తులకు అడ్డగా మారుతోంది. గతంలో కాప్రా కార్యాలయం అంటేనే ప్రజలు పరిశీలించి ఆదర్శంగా తీసుకునేవారు ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉంది. మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో రెవెన్యూ విభాగం చెందిన అధికారులు, సిబ్బంది కార్యాలయంలో మద్యం సీసాలతో శనివారం అర్ధరాత్రి విందులు ఏర్పాటు చేశారు. కార్యాల యంలో తమ సీట్లలో మద్యాన్ని సేవిస్తూ మాంసా న్ని తింటూ అర్ధరాత్రి వరకు విలాసంగా గడిసారు. అర్ధరాత్రి వరకు కార్యాలయం లో లైట్లు వెలుగుతూ చిందులు వేస్తుండడంతో సమాచారం అందుకున్న మీడి యా ప్రతినిధులు అక్కడికి వెళ్లి పూర్తిగా రికార్డ్ చేశారు. ఇది గమనిం చిన అధికారులు సిబ్బం ది హుటా హుటిన వెళ్లిపోయారు.
ప్రభుత్వ కార్యాలయాన్ని బార్లుగా మార్చివేశారని ఈ ఘటనపై ప్రజలు మండిపడుతున్నారు. గతంలో కూడా పారిశుధ్య విభాగానికి చెందిన సిబ్బంది కూడా కార్యాల యంలోనే విందులు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ అధికా రులు మాత్రం ఏం పట్టనట్టుగా ఉంటు న్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిం చి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విచారణ జరిపించాలి : సీపీఐ(ఎం)
కాప్రా సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన మద్యం విందు కార్యక్రమంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
విచారిస్తున్నాం : డిప్యూటీ కమిషనర్
కాప్రా కార్యాలయంలో జరిగిన సంఘటనపై విచారణ జరిపిస్తున్నామని డిప్యూటీ కమిషనర్ శంకర్ పేర్కొ న్నారు విచారణలో సంబం ధిత వ్యక్తులపై ఉన్నతా ధికారుల దష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూస్తామన్నారు.