Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో పాత మంచినీటి పైపులైను తొలగించి నూతన హెచ్డీపీ పైపులు ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ నాచారం డివిజన్ పరిధిలో గత 25 సంవత్సరాల క్రితం వేసిన మంచినీటి పైప్లైన్లతో ప్రెజర్ లీకేజీలతో సతమతమవుతున్నారని తమ దష్టికి తీసుకురావడంతో అధికారులతో చర్చించి నూతన పైపులైన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కార్పొరేటర్ గా తన వంతు కషి ఉంటుందని అన్నారు. బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత అధికారుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ఎప్పు డూ ముందుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయక ులు సాయిజెన్ శేఖర్, మల్లేష్ యాదవ్, విఠల్ యాదవ్, కట్టబుచ్చి గౌడ్, చంద్రశేఖర్ ,వెంకటేష్, కైలాష్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.