Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
దేశంలో మోడీ పాలనలో కేడిల రాజ్యం కొనసాగుతు న్నదని కాంగ్రెస్ ఉప్పల్ బీ బ్లాక్ ఎస్సీ సెల్ చైర్మెన్ పొన్నాల రాజు అన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా గాంధీ భవన్లో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గ బి బ్లాక్ ఎస్సీ సెల్ నాయకులు తరలివెళ్లి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రధానిమోడీ ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిం చారన్నా రు. రాహుల్ పార్లమెంటు సభ్య త్వాని రద్దు చేయడం హాస్యా స్పదంగా ఉందని అన్నారు. మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ పత్తి కుమార్, కన్వీనర్ సునీత, నాయకులు సునీల్, రాహుల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.