Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్ మెట్
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, వారి కృషి, పట్టుదలతో మరో మారు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంబీపూర్ రాజు, ఇన్చార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డిలు అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన శనివారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో బీఆర్ఎస్ మల్కాజిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధులుగా హాజరైన వారు, ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మాత్రమే అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నట్టు చెప్పారు. వీటిపై పార్టీ కార్యకర్తలు గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.సీఎం కేసీఆర్ కృషితో అభివద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అందరూ కలిసి కట్టుగా పని చేసి మరో మారు బీఆర్ ఎస్ గెలుపు లక్ష్యంగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచారం గడపగడపకు తీసుకుపో వాల్సిన బాధ్యత మీ అందరిపై ఎంతో ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నేటి నుంచే సైనికుడిలా పని చేసి మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్లు సునీత రాముయాదవ్,ప్రేమ్ కుమార్,మీనా ఉపేందర్ రెడ్డి, శాంతి శ్రీనివాస్ రెడ్డి, జితేంద్ర నాథ్,గజ్జెల నాగేష్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,మల్కాజ్ గిరి సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్,కొండల్ రెడ్డి,అధికార ప్రతినిధి, జీఎన్వీ సతీష్ కుమార్,రాముయాదవ్, గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి, ఆమీనుద్దిన్, డివిజన్ అధ్యక్షులు పివి సత్యనారా యణ తదితరులు పాల్గొన్నారు.