Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కష్టం, ప్రజల మన్ననలు కావాలి
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అడిక్‌మెట్‌లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఎమ్మెల్యే కావాలన్న కోరికుంటే సరిపోదని, దానికి కష్టం, ప్రజల మన్ననలు కావాలని మంత్రి తలసాని శ్రీనివా స్ యాదవ్ సూచించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్ మెట్ డివిజన్లో కమ్యూనిటీ హాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదివారం నిర్వహించారు.ఈ సమ్మేళన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర మాజీ అధ్యక్షులు కట్టెల శ్రీనివాస్, యువ నాయకులు తల సాని సాయికిరణ్, ముఠా జై సింహా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలం గాణ రాష్ట్రాన్ని సంక్షేమ పథకాలతో బంగారు తెలంగాణగా మార్చారని తెలిపారు. 24 గంటలు కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఆడబిడ్డ లకు కల్యాణ లక్ష్మి, దళితులకు దళిత బంధు, రైతులకు రైతుబంధు అందించడం చరిత్రలో కనివిని ఎరుగని పథ కాలని అన్నారు. కేంద్ర మంత్రి, ఎంపీ కిషన్ రెడ్డి కనీసం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఏదైనా ఒక్క బస్తీనైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో గులాబీ జెండాను తమ సొంత జెండా అజెండాగా ప్రజలు మార్చుకు న్నారని తెలిపారు. కార్యకర్తలు మనలో మనమే విభేదాలు సృష్టించుకోవద్దని సూచించారు. ప్రతీ ఒక్కరికి వెంటనే ఎమ్మెల్యే కావాలని కోరిక సహజంగా ఉంటుందని.. అయితే ఎమ్మెల్యేలు కావాలంటే కేవలం కోరిక ఉంటే సరిపోదని అనునిత్యం ప్రజలతో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కష్టపడుతూ వారి మన్ననలు పొందాలని తెలిపారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ 40 సంవత్స రాలుగా ప్రజాసేవ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనునిత్యం ప్రజలతో ఉంటూ ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాసరెడ్డి, ఆర్ మోజేస్, మనోహర్ సింగ్, తదితర నాయకులు పాల్గొన్నారు.