Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానికేశ్వరి నగర్ అఖిలపక్ష నాయకులు
నవతెలంగాణ-ఓయూ
ప్రభుత్వాస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించాలని మానికేశ్వరి నగర్ అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్మాణం జరిగే వరకు పార్టీలకు అతీతంగా పోరాడా లని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్ మాణికేశ్వరీ నగర్ లో ప్రభుత్వ ఆస్పత్రిని తక్షణమే నిర్మిం చాలని పలువురు అఖిలపక్ష నాయకులు ఆదివారం బస్తీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానికేశ్వరి నగర్ లో ఉన్న ఓయూ భూమిని ఆస్పత్రి నిర్మాణానికి కేటాయించాలని కోరారు. యునివర్సిటీ నిర్మాణానికి రాళ్లు మోసి, తెలంగాణ ఉద్య మంలో వర్సిటీకి తోడుగా నిలిచి పోరాడిన బస్తీ వాసులకు ఆస్పత్రి కేటాయించడంలో ఓయూ అధికారులు ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. పెట్రోల్ బంకులు, థియేటర్లకు స్థలం ఇస్తున్న వర్సిటీ అధికారులు ఆస్పత్రికి ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు. వెంటనే స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి నిర్మాణం జరిగే వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమానికి హాజరైన నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, బీ ఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డిలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులకు అండగా అక్కున చేర్చుకున్న ఘనత మీదని, సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఆస్పత్రి నిర్మాణం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపి నాయకులు బండ చంద్రా రెడ్డి, టీడీపి సికింద్రాబాద్ ఇన్ చార్జి నాయకులు వల్లారపు శ్రీనివాస్, ఆలకుంట హరి, గండికోట విజరు కుమార్, హాజరై సంఘీభావం ప్రకటించి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చారు.