Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మంచి మనసు లేకపోవడమే అసలైన వైకల్యం అని, శారీరక లోపాలు శాపం కాదని, ఒక సవాలుగా స్వీకరించి ముందుకెళ్లాలని పలువురు వక్తలు అన్నారు. అంగవైకల్యం ఉందని బాధపడకుండా ఇంకొక విధంగా వున్న సామర్థ్యాన్ని వినియోగించుకోగలిగితే దివ్యాంగులు అసాధారణ ప్రజ్ఞావంతులు కాగలుగుతారని పలువురు దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఐడియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డిజేబుల్డ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ ఇఫ్తార్ సమావేశంలో చెవి, మూగ, అంధ విద్యార్థులు, దివ్యాంగ యువతీ, యువకులు హాజరయ్యారు. ఐడియల్ స్కూల్ దివ్యాంగులకు ఇఫ్తార్ ఏర్పాటు చేయడం పట్ల బోధ న్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ అభినందించారు. సమావేశంలో జమాఅతె ఇస్లామీ హింద్ స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా హామి ద్ ముహమ్మద్ ఖాన్, స్కూల్ చైర్మెన్ హాఫిజ్ రషాదుద్దీన్, వైస్ చైర్మెన్ ఖలీలుర్రహ్మాన్, సెక్రటరీ నవీదుర్రహ్మాన్ పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ఎమ్మెల్యే షకీల్ ఖర్జూరాలు తినిపించి ఇఫ్తార్ విరమిం పజేశారు. దివ్యాంగులకు మనం అం దించే స్నేహహస్తం వారి చీకటి బతుకుల్లో కాంతిరేఖలను విరజిమ్మి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతిభావంతులుగా నిలబెడుతుందని దివ్యాంగ విద్యార్థులు తమ నాటికల్లో చెప్పకనే చెప్పారు.