Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ అధ్యక్షులుగా కే యాదగిరి, గౌరవాధ్యక్షులుగా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా శివాంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రజక వత్తిదారుల సంఘం హైదరాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి రాపర్తి అశోక్ ఆదివారం నూతన సంఘాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ రజక వత్తిదారులకు ఐదు లక్షల రుణం ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి రజక కుటుం బానికి ఇల్లు కానీ, ఇంటి స్థలంగాని కేటాయించాలని డిమాండ్ చేశారు. రజకులకు రక్షణ చట్టం చేయాలని కోరా రు. రజకుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు జనగాంలో ఈనెల చివరి వారంలో ఉన్నా యని, భవిష్యత్ పోరాటాలకు ఆ మహాసభలో పిలుపునిస్తామని, రజక వత్తిదారులందరూ తప్పక పాల్గొని సభలను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.