Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ చీమ శ్రీనివాస్
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలపై ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావుల పోరం ఆధ్వర్యంలో మాదిగ సంఘాలు మాదిగ మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ దళితులు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా బాబు జగ్జీవన్ రామ్ కషి చేసినట్టు తెలిపారు. భారత రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు సంపూర్ణ సహకారం అందించిన వ్యక్తి అన్నారు. అంబేద్కర్ మరణానంతరం రాజ్యాంగాన్ని అమలుపరచడం, రాజ్యాంగ హక్కులను కాపాడిన వ్యక్తి అన్నారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పి కొట్టాలని మాదిగ సంఘాలకు మేధావులకు పిలుపునిచ్చారు. మాదిగలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి నట్టు తెలిపారు. మాదిగలు నేడు అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మాదిగ కులానికి చెందిన మసిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలన్నారు.