Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంతోష్‌నగర్
జీఓ నంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన డివిజన్ పరిధిలోని గడ్డిఅన్నారం పిల్లిగుడిసె వాసులకు మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల పట్టాలు అందజేశారు. పాతబస్తీ పంజషా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గుడిసెవా సులకు సైదాబాద్ తాసీల్దార్ వేణుగోపాల్‌తో కలిసి ఆయన పట్టాలను అందజేసి మాట్లాడారు. చాలా కాలంగా స్థానికంగా గుడిసెలు వేసుకుని, ఇండ్లు నిర్మించుకున్న పేదలను గుర్తించి అర్హులైనవారికి ప్రభుత్వం పట్టాలను అందజేస్తున్నదని తెలిపారు. ఆరేండ్ల క్రితం 58 జీఓకు కింద దరఖాస్తు చేసుకోవడంతో అర్హులైన వారికి పట్టాలిచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు దళిత బంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథ కాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ వేణుగోపాల్, డిప్యూటీ తాసీల్దార్ రాజు, ఎంఐఎం నాయకులు, లబ్ధిదారులు స్థానికులు నాయకులు కార్పొరేటర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.