Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం అని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ డివిజన్లోని గణేష్ నగర్లో నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన ఎనిమిది సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివద్ధి ప్రతీ కాలనీలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలోను కనిపిస్తున్నాయని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తీ ఆపలేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి,అరటికాయల భాస్కర్ ముదిరాజ్, లేతాకుల రఘుపతి రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, చింతల నరసింహారెడ్డి, మస్కా సుధాకర్, గోరిగే ఐలేష్, జహంగీర్, సత్యపాల్ రెడ్డి, నోముల మైసయ్య పాల్గొన్నారు.