Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చల్లా నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
ప్రజా వ్యతిరేక విధానాలు అవలం బిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని తిరుమల గార్డెన్లో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబావి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు బాబు,జంగారెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పేరు మార్చి అమలు చేస్తున్నారని తెలిపారు.
పార్టీకి ప్రజలు, కార్యకర్తలేనన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను కాపాడు కుంటూ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండ కట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే బడుగు బహీనవర్గాల, మైనార్టీలకు అనేక అభివద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, మనోహర్, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్‌రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, సీనియర్ నాయకులు నవ్వారు మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బాల్ లింగని జంగయ్య, బోయపల్లి గోవర్దన్ రెడ్డి,వెంకట్‌రెడ్డి, ధన్ రాజ్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు అమత నాయుడు, ఐలమ్మ, శుభాన్ యాదవ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ డివిజన్ల చెందిన కాంగ్రెస్ పార్టీముఖ్య కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.