Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బేతి, కార్పొరేటర్ బన్నాల
నవతెలంగాణ-ఉప్పల్
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, కార్పొ రేటర్ బన్నాల గీత అన్నారు. ఆదివారం చిల్కా నగర్ డివిజన్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఓపెన్ జిమ్ పనులకు ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్ బాన్నాల గీతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేేతి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివద్ధి పనులు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరుగుతుందని అన్నారు. కార్పొరేటర్ గీతాప్రవీణ్ ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ ప్రణాళికాబద్ధంగా డివిజన్‌ని అభివద్ధి పథంలో నడుపుతున్నారని, వారిని అభినంది స్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఈఈ నాగేందర్, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బీఆర్ఎస్ నాయకులు బద్దం భాస్కర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎదుల కొండల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగ్‌రావు, పండ్ల కిషన్, బాణాల నారాయణరెడ్డి, అశోక్‌చారి, అబ్బో భారు, మహమూద్, చేర్యాల శ్రీనివాస్, రామానుజం, ఫోటో బాలు, ముద్దం శ్రీనివాస్, బాలేందర్, యాదగిరి, సుందర్, హమీద్, సకినాల ప్రసాద్, శైనాజ్, గరిక సుధాకర్, శ్యామ్ కాలనీ అధ్యక్షులు రోషి రెడ్డి, రామకష్ణ, నర్సింగ్ రావు, ఫయాజ్, సిదేశ్వర్ మొదలగువారు పాల్గొన్నారు.