Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రహదారి నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపన
- ప్రోటోకాల్ పాటించడం లేదని అధికారులపై మేయర్ ఆగ్రహం
నవతెలంగాణ-బడంగ్పేట్
ఎంతో కాలంగా అసంపూర్తిగా ఉన్న బడంగ్పేట్ నుండి నాదర్ గుల్ గ్రామం వరకు రహదారి నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. మంగళవారం మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాంధీనగర్ నుండి నాదర్గుల్ ప్రభుత్వ పాఠశాల వరకు ప్రధాన రహదారికి మోక్షం లభించింది.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ఆదేశం మేరకు రూ.9కోట్ల హెచ్ఎండిఏ నిధులు కేటాయించి నేడు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, కమిషనర్ కష్ణమోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు పెద్దబావి ఆనందరెడ్డి, ఫ్లోర్ లీడర్ సుర్ణ గంటి అర్జున్, కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్‌గౌడ్, ఇంద్ర సైనా, తోట శ్రీధర్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, లిక్కి మమత కష్ణారెడ్డి, యాతం పవన్ యాదవ్, భాగ్యనగర్ రైతు సహకార సంఘం చైర్మెన్ మర్రి నరసింహారెడ్డి, కోఆప్షన్ సభ్యులు మర్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు కుమార్ గౌడ్, ఇంద్రవెల్లి యాదయ్య, బీసీి సెల్ అధ్యక్షులు కోటగిరి జంగయ్య బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రోటోకాల్ పాటించడం లేదని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై మేయర్ ఆగ్రహం
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గాంధీనగర్ నుంచి నాదర్గుల్ గ్రామం వర కు ప్రధాన రహదారి రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్య క్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడంలేదని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక మేయర్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి రాకముందే అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పనులు ప్రారంభించటం ఏమిటని ప్రశ్నించారు. అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యక్రమంలా మంత్రి చేయటం, అధికారులు మంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ప్రజాస్వామ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులకు విలువలేకుండా చేస్తున్నారని ఆరోపిం చారు. రోజు రోజుకు మంత్రి ఉనికిని కోల్పోతున్నార ని తెలిపారు.
రాజకీయ విభేదాలతో మంత్రిపై మేయర్ ఆరోపణలు
డిప్యూటీ మేయర్ ఇబ్రంశేఖర్
నాదర్గుల్ గ్రామంలో రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పనిభారం వలన మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్ణయించిన సమయం కంటే కొంత ఆలస్యంగా రావడం జరిగిందని,మేయర్ పారిజాత నర్సింహారెడ్డి రాజకీయ విభేదాలతోనే ఆలస్యంగా వచ్చి మంత్రి పై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్లు మంత్రితో శంకుస్థాపన పనులు చేయించి తిరిగి మేయర్ కు వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి రాజకీయాలకు అతీతంగా మున్సిపల్ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, డీిఈఈలు అశోక్ రెడ్డి, జ్యోతి, ఏఈలు బిక్కు నాయక్, రాం ప్రసాద్ రెడ్డి,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.