Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-సరూర్‌నగర్
ఇల్లు లేని ప్రతి పేదవాడికి సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న వారికి ప్రభుత్వ జీవో నెంబర్ 58, 59తో ఎంతో లబ్ధి చేకూరుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ మండల కార్యాలయంలో 95 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సరూర్‌నగర్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్ నగర్, శంకర్ నగర్, అంబేద్కర్ నగర్లలో కొన్ని ఏళ్లుగా నివసిస్తున్నవారికి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, ఏ కారణంచేత అయినా దరఖాస్తు చేసుకొని దరఖాస్తు రిజెక్ట్ అయిన వారికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 30 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమయం ఇచ్చారని ఇలాంటి మంచి అవకాశాన్ని పేద ప్రజలు ఉపయోగించుకొని లబ్ధి పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు దయానంద్ గుప్తా, ఎగ్గే మల్లేశం, కందుకూర్ ఆర్డీవో సూరజ్, ఎమ్మార్వో జయశ్రీ, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బేరా బాలకిషన్ (బాలన్న), మురుకుంట్ల అరవింద్ శర్మ, గడ్డిఅన్నారం. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామ నర్సింహా గౌడ్, లోకసానిి కొండల్ రెడ్డిి, ఇంటూరి అంకిరెడ్డి, రాజేష్ గౌడ్, రాఘవేంద్ర గుప్తా, సుదర్శన్, సాజిద్, మహమ్మద్ సలీం, ఋషి, పాల్గొన్నారు.