Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- 305 మందికి పట్టాల పంపిణీ
నవతెలంగాణ - మీర్పేట్
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న నిరుపేదల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్ దాసరి నారాయణరావు కాలనీలో జిఓ 58, 59 కింద రెగ్యులరైజ్ దరఖాస్తు పెట్టుకున్న 345 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలలో ఇండ్ల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న పేదలకు ఈ పట్టాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు.
ఈ అవకాశం మరోసారి కూడా ఇవ్వడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఇప్పటికి రెగ్యులరైజ్‌కు పెట్టుకోనివాళ్లు ఉపయోగించుకోవాలని సూచించారు. భయం గుప్పిట్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం కావడంతో చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇంత మంచి అవకాశం ఇచ్చి సొంతింటి కల నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు మరవద్దని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఆర్డీవో సూరజ్‌కుమార్, బాలాపూర్ మండల తహసీల్దార్ జనార్దన్ రావు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ప్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మాదరి సురేఖ రమేష్, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు భారీగా ప్రజలు పాల్గొన్నారు.