Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారం ఘనం, ఆచరణ శూన్యం
- కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు తుంగతుర్తి రవి
నవతెలంగాణ-బోడుప్పల్
లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా స్ట్రాటజీక్ నాల డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) ద్వారా మూసీకి అనుసంధానం చేసేలా చేపట్టిన ప్రాజెక్టు పనులను ప్రారంభించి ఏడాది దాటినా ఇప్పటికీ అతీగతి లేదని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో వర్షాకాలంలో ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు ద్వారా రూ.110 కోట్ల వ్యయంతో నాలా పనులను ప్రారంభించామని, 2022 ఫిబ్రవరిలో రాష్ట్ర ఐటి మంత్రి కేటీఅర్ స్వయంగా ప్రారంభించిన ప్రాజెక్టు ప్రారంభమై ఏడాది దాటిన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని అన్నారు. ఎస్ఎన్డీపీ పనుల కోసం గత రెండు వారాలుగా పర్వతాపూర్ ప్రధానమార్గం మూసివేయడం ద్వారా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. కేవలం 20 మీటర్ల పైప్లైన్ వేయడానికి నెలల తరబడి సమయం తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని రవి ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వచ్చే వర్షాకాలం నాటికైన లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ఎస్ఎన్డీపీ పనులను చకచకా పూర్తిచేయాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.