Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్ష సమావేశంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్లు నిరంతరం శుభ్రంగా ఉండేందుకు గాను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ జక్క వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారంనాడు కార్పొరేషన్ కార్యాలయంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్స్, ఎఫ్ఎస్టీపీ, చెరువుల సుందరీకరణ మరియు స్పెషల్ సానిటేషన్ మొదలైన అంశాలపై మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ డా.పి.రామకృష్ణరావు, డా. ఎం.స్నేహలత అసోసియేట్ ప్రొఫెసర్ ఏఎస్సీఐ (అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా) బృందంతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. పబ్లిక్ టాయిలెట్స్‌ను ఆధునీకరించడంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వంటి మౌలిక సదుపాయల కల్పించడం. మహిళల కోసం ప్రత్యేకంగా శానిటరీ ప్యాడ్ వెండింగ్ మెషిన్, బర్నింగ్ మిషన్ అందుబాటులో ఉంచడం, ఎప్పటికప్పుడు ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు ఫుట్ ఫాల్ మేజర్మెంట్ మిషన్, స్మెల్ డిటెక్టర్ మొదలైన ఆధునిక పరికరాల అమర్చడం, నగరంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా మరిన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం, ప్రధానంగా పెద్ద మొత్తంలో మానవ వ్యర్ధాలు ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు
(అపార్ట్మెంట్స్, హోటల్స్, హాస్పిటల్స్, గేటెడ్ కమ్యూనిటీ) గుర్తించి వాటి వద్ద డీ సెంట్రలైసెడ్ ఎస్టీపీ నిర్మాణం లేదా వినియోగంలోకి తీసుకురావడం, సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే సిబ్బంది కొరకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిం చడం, చెరువుల శుద్ధీకరణలో భాగంగా పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించడంతోపాటు అనంతరం చెరువులో బయో డైజెస్టర్ వంటి ఆధునిక యంత్ర పరికరాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా నీటిని శుభ్రపరచడంతో పాటు నీటిలో ఆక్సిజెన్ శాతాన్ని పెంచడం, తద్వారా చెరువును మంచి నీటి చెరువుగా మార్చడం, ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, మద్ది యుగేందర్ రెడ్డి, దింతిరి హరిశంకర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు బోడిగే రాందాస్ గౌడ్, ఇర్ఫాన్, నాయకులు మాడుగుల చంద్రారెడ్డి, బండి సతీష్‌గౌడ్, ఈశ్వర్‌రెడ్డి, అలవాల దేవేందర్ గౌడ్, జావీద్ ఖాన్, డీఈఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, మేనేజర్ జ్యోతిరెడ్డి, ఏఈ బిక్షపతి, వినీల్, శశిప్రియ, ఎఫ్ఎస్ఎస్ఎం కోఆర్డినేటర్, సీడీఎంఏ - ఏఎస్సీఐ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మురళి తదితరులు పాల్గొన్నారు.