Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ జక్క వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి ప్రియకాలనీలో హెచ్ఎండబ్యూఎస్, సీవరెజీ బోర్డు వారు సుమారు రూ.2 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ పైపులైన్ల పనులను మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా క్రమం తప్పకుండ మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నగర పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అవి పూర్తయితే రానున్న రోజుల్లో ప్రతిఇంటికీ 24 గంటలు మంచి నీరు సరఫరా చేసే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామన్నారు. అనంతరం డివిజన్లో దోమల నివారణలో భాగంగా ఇంటింటకీి దోమల మందు పిచికారి చేసే కార్యక్రమాన్ని మేయర్ జక్కవెంకట్ రెడ్డి, కార్పొరేటర్ బైటింటి శారద ఈశ్వర్రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, జలమండలి మేనేజర్ రమ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కంటి వెలుగుతో అనేక ప్రయోజనాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్, బుద్ధనగర్ కమ్యూనిటీ హాల్లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్ భీంరెడ్డి నవీన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమర్ సింగ్,డీఈఈ శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ జానకి, నాయకులు పెంటయ్యగౌడ్, పప్పుల అంజిరెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.