Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్
- టీఎన్జీవో ఇఫ్తార్ విందుకు హాజరైన మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సేవరత్న డాక్టర్ ఎస్.ఎం.హుస్సేనీ(ముజీబ్) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సంఘం ప్రాంగణంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వక్ఫ్‌బోర్డు చైర్మెన్ మసిఉల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఇంతియాజ్ ఇషాక్, హజ్ కమిటీ చైర్మెన్ సలీం, ఉర్దూ అకాడమీ చైర్మెన్ తారిఖ్ అన్సారీ, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అయాచితం శ్రీధర్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్ గజ్జెల నగేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ సాయి చంద్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, జిల్లా కార్యదర్శి విక్రమ్, కోశాధికారి జె.బాలరాజ్, సహాధ్యక్షుడు కె.ఆర్.రాజ్‌కుమార్, సభ్యులు ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, నరేష్ కుమార్, ఎం.ఏ.ముజీబ్, ఖాలెద్ అహ్మద్, సుజాత, గీత, శ్రీహరి బాబు, వైదిక్ శస్త్ర, శంకర్, ఎం.ఏ.ముఖీమ్ ఖురేషి, శ్రీధర్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, కార్యదర్శి ఖాదర్ బిన్ హాసన్ సహాధ్యక్షుడు ఎం.ఏ.ముజీబ్, సయ్యద్ జహంగీర్ పాషా, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణ రెడ్డి, వహీద్, మహమ్మద్ ముస్తఫా షరీఫ్, లతీఫ్, జీషాన్ అలీ, చావుష్, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు సుమారు 4 వేల మంది విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సంఘం ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసముంటున్న తరుణంలో తెలంగాణ ప్రజలందరినీ చల్లగా ఉండాలని ఎలాంటి విపత్తులు రాకుండా కాపాడాలని, సమయానికి వర్షాలు కురవాలని, రైతులు ఆనందంగా ఉండాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని ఆకాంక్షిం చారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన అతిథులందరికి ధన్యవాదాలు తెలపడంతో పాటు క్త్రెస్తవ సోదర సోదరీమణులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.