Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్యోగకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే పోషణ పక్వాడ లక్ష్యం..
- 5 ప్రాజెక్టుల్లోని 914 అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహణ
- చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గర్భిణులకు, బాలింతలకు, కిశోర బాలికలతో పాటు పిల్లలకు, తల్లిదండ్రులకు, ప్రజలకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు చిరుధా న్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషణ పక్షోత్సవాలు ముగిశాయి. పోషణ పక్వడా-2023లో భాగంగా 'అందరికీ పోషకాహారం.. ఆర్యోగ భారతం దిశగా కలసి అడుగేద్దాం' అనే థీమ్ ఆధారంగా హైదరాబాద్ జిల్లాలోని అయిదు ఐసీడీఎస్ ప్రాజె క్టుల పరిధిలోగల 914 అంగన్వాడీ సెంటర్లలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల షెడ్యూల్ ప్రకారం సూచించిన కార్యక్రమాలను మార్చి 20 నుంచి ఈ నెల3వ తేదీ వరకు అన్ని కేంద్రాల్లో ఘనంగా నిర్వహిం చారు. అదేవిధంగా పోషణ పక్షోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసేందుకుగాను జిల్లా సంక్షేమ శాఖ అధికారి అక్కేశ్వర రావు ఎప్పటికప్పుడు సీడీపీవోలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ కో-ఆర్డినేటర్లతో పాటు జిల్లా కో-ఆర్డినేటర్లతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు.
పోషణ్ పక్వడాలో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ స్థాయిలో ఆరోగ్య పిల్లల పోటీలను నిర్వహించి.. సాధారణ స్థాయిలో ఉన్న ఆర్యోగవం తులైన పిల్లలను, తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి సర్టిఫికెట్స్ అందజేశారు. అంతేగాక శ్రీ అన్న చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పిం చి పోషకాహార శ్రేయస్సుకు వాటి అవసరాన్ని చాటి చెప్పటంతో పాటు చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార పదార్థాలు అనుబంధ పోషకాహారంగా వాడటం, ఇంటింటి ప్రచారం, పోషకాహార సలహాల శిబిరాల ఏర్పాటు వంటివి చేపట్టారు.
ఆర్యోగవంతమైన పిల్లల పోటీ..
కొన్ని ప్రమాణాల ఆధారంగా హెల్దీ బేబీ లేదా ఆరోగ్యవం తమైన పిల్లల పోటీలను నిర్వహించారు. సరైన పోషకాహారంతో మంచి ఆర్యోగం కొనసాగించడం మీద అవగాహన కల్పించారు.
సాక్షమ్ అంగన్వాడీలకు ప్రాచుర్యం కల్పించటం..
సాక్షమ్ అంగన్వాడీల గురించి అవగాహన పెంచటానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఈ కేంద్రాల లో అదనపు మౌలిక వసతులు కల్పించి మెరుగైన పోషకాహారం అందించే కేంద్రాలుగా శిశు, సంరక్షణ విద్యా కేంద్రాలుగా వాటిని తీర్చిద్దిడటం వంటివి. మొత్తం 15రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాలను జన్ ఆందోళన్ డాష్‌బోర్డ్‌లో నమోదు చేశారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 77,633 నమోదు చేసినట్టు జిల్లా సంక్షేమశాఖ అధికారులు తెలిపారు.