Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ హర గోపాల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అసలు దోషులను కఠినం గా శిక్షించాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ, టీఎస్పీఎస్సీ విశ్వసనీయత, నిరుద్యోగుల భవిష్యత్తుపై మంగళవారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు ఏ నినాదంతో మొదలైందో ఆ నినాదాన్ని పూర్తిగా పాతరేసి నియంత పాలన చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ.. 100 మంది ఉన్న బాలికల పాఠశాలలో ఒక మరుగుదొడ్డి ఉంటే కనిపించడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయ కులు పాఠశాలల స్థలాలు కబ్జాలు చేయడం కనిపించడం లేదా? అని నిలదీశారు. కనీసం ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేకుండా పాఠశాలలు ఉన్నాయని అన్నారు. విద్యా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ కె చక్రధర్‌రావు మాట్లాడుతూ విద్యార్థి సంఘాలు, సామాజికవేత్తలు, వివిధ పార్టీ నాయకులతో కలిసి చర్చలు కొనసాగించి రాష్ట్రవ్యాప్తంగా తమ కార్యచరణ మొదలు పెడతామని తెలిపారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి, పబ్లిక్ కమిషన్‌కు తెలియకుండా పేపర్ లీకేజీ ఎలా జరుగు తుందో 30 లక్షల మంది యువతకు సమాధానం ఇవ్వాల న్నారు. మెయిల్ ఐడీలు ఇతర కంప్యూటర్లో ఓపెన్ చేయడానికి పాస్వర్డ్ అడిగే ఈ రోజుల్లో పేపర్ లీకేజీ అతి చిన్న ఉద్యోగుల వల్ల జరిగిందనడం విడ్డూరంగా ఉంద న్నారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఉద్యోగాలు ప్రకటించని ప్రభుత్వం ఎన్నికల సమయం రాగానే ఉద్యోగాలు గుర్తొచ్చి ఏకధాటిగా ప్రకటనలు చేసి పేపర్ లీకేజీల ఉదాంతంతో నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నదన్నారు. యువతతో పెట్టుకోవద్దని.. శ్రీలంక అధ్యక్షునికీ పట్టిన గతి సీఎం కేసీ ఆర్కు పడుతుందని హెచ్చరించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్య క్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించడంతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ప్రకారం ఉద్యోగ చట్టం తీసుకురావాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ, ఆజాద్, మహేష్‌లు మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ రాష్ట్రాల వారిని ప్రగతి భవన్ కు ప్రత్యేకంగా తీసుకువచ్చి మూలాఖాతులు చేస్తున్న ముఖ్యమంత్రికి ఆనాటి ఉద్యమ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు.
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పై పూర్తిగా నమ్మకం కోల్పోయిన రాష్ట్ర యువత తిరిగి దాని నుంచి ఎటువంటి ఉద్యోగ ప్రకటన వచ్చిన రాయకూడదని విషయాన్ని స్పష్టం గా తెలియజేయడానికి కమిటీ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఈనెల 6న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కమిటీ తెలిపింది. ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ ,రాష్ట్ర పివైఏల్ ప్రధాన కార్యదర్శి కేఎస్ ప్రదీప్ పాల్గొని మాట్లాడారు.