Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో కిడ్నీ బాధితులకు హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దూర, ఆర్థిక భారం తప్పనుందని తెలిపేందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఘట్కేసర్ మున్సిపల్ ప్రజలకు సమయానుకూలంగా సేవలను పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు లభించింది. ఆస్పత్రిలో వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు కృషితో కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం ఘట్కేసర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లిపావని జంగయ్య యదవ్ వైస్ చైర్మెన్ పలుగుల మాధవరెడ్డి సహకార బ్యాంక్ చైర్మెన్ సింగిరెడ్డి రాంరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్‌రెడ్డి, బండారి ఆంజనేయులుగౌడ్, కొమ్మిడి అనురాధ, సల్లూరి నాగజ్యోతి నర్సింగ్ రావు, బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, కడుపొల్లా మల్లేష్, జహంగీర్, బేతల నర్సింగ్‌రావు, కుతాది రవీందర్, కో-ఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ, బొక్క సురేందర్ రెడ్డి, వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కోట్య నాయక్, వైద్య అధికారులు, మాజీ సర్పంచ్‌లు, బ్యాంకు డైరెక్టర్లు, ఆలయ డైరెక్టర్లు, మాజీ వార్డు సభ్యులు, వివిధ హోదాలలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధాలకమిటీ అధ్యక్షులు-కార్యదర్శులు కమిటీసభ్యులు బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీ వార్డ్ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు అభిమానులు పార్టీ కుటుంబ సభ్యులు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.