Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూజీసీ మాజీ చైర్మెన్, ప్రొఫెసర్ సుఖడేవ్ ధోరట్
నవతెలంగాణ-కల్చరల్
రాజ్యాంగంలో దేశం అంతటికీ ఒకే న్యాయ వ్యవస్థ, ఒకే శాసన వ్యవస్థ, ఒకే పాలనా విధానం పొందు పరచిన అంబేద్కర్ మార్గమే ముఖ్య మంత్రి కే.సి.ఆర్ ఆదర్శంగా గ్రహించారని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మాజీ చైర్మెన్ ప్రొఫెసర్ సుఖదేవ్ ధోరట్ ప్రశంసలు కురిపించారు. కె.సి.ఆర్ దళితుల అభ్యున్నతికి తీసుకొంటున్న నిర్ణయాలు దేశమంతటికి కర దీపిక కావాలని ఆయన పేర్కొ న్నారు. రాష్ట్ర సచివాలయానికి అంబెడ్కర్ నామకరణం చేయడంతో పాటు ఆ ప్రాంగణంలో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపే మహా సభను రవింద్రభారతి ప్రధాన వేదిక పై ప్రబుద్ద భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్.సి. ఎస్.టీ. ఆఫీసర్స్ ఫోరమ్ నిర్వహణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సుఖదేవ్ పాల్గోని మాట్లాడారు. అంబేడ్కర్‌కు జాతీయ నాయకులలో గాంధీకి ఉన్న స్థానం ఉందని పేర్కోన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారా యణ మాట్లాడుతూ మోడీ నియంతృత్వ పాలనకు దేశ ప్రజలు చక్ర బంధంలో బందీలయ్యారని అన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లిందని, ఆయన స్ఫూర్తి ని అందుకునేందుకు కె.సి.ఆర్ అంబెడ్కర్ పేరు రాష్ట్ర సచివాలయానికి పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టి దళిత బహుజన ఆత్మగౌరవం కె.సి.ఆర్ పెంచారని కొని యాడారు. టి. సమైక్య రాష్ట్ర పూర్వ్య ప్రధాన కార్యదర్శి కాకి మాధవ రావు, బుద్ధ వనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యలు మాట్లాడుతూ కె.సి.ఆర్కు దళితుల బడుగు బలహీన వర్గాల పట్ల సహజంగా నే సానుభూతివుందని 2003 లోనే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ సమస్యపై సి.పే.ఏం వారితో కలసి ఉద్యమించేయారని గుర్తు చేశారు ఆంధ్ర జ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంబెడ్కర్‌కు చిన్న రాష్ట్రాల పట్ల ఉన్న సానుకూలత వల్ల తెలంగాణ రాష్టం సాధ్యమైందన్న భావనతో నే కె.సి.ఆర్ ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు రవీం దర్, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు రమేష్,మహిళ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు విజ్యు లత, రాష్ట్రం లోని ఇతర విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం దేశానికే ఆదర్శమన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మె న్ గంటా చక్రపాణి మాట్లాడుతూ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి అంబేడ్కర్ నామకరణం చేయడం విప్ల వాత్మక నిర్ణయాలని ధన్య వాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రబుద్ధ భారత్ జాతీయ అధ్యక్షుడు నర్రా రవి కుమార్ అధ్యక్షత వహించిన సభలో ఢిల్లీ వసంత్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.