Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న డ్రయినేజీ వ్యవస్థ మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్‌పేట డివిజన్ పటేల్‌నగర్ చిలుకమ్మ గల్లీలో రూ.14 లక్షలతో నూతనంగా వేయనున్న డ్రయినేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్ గౌడ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్ పేట డివిజన్లో అవసరమైన ప్రతి చోటా నూతన డ్రయినేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామనీ, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అప్పటి జనాభాకు అనుగుణంగా ఉన్న డ్రైనేజీ పైప్ లైన్ తో ఇప్పటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుండడంతో తీవ్రంగా సమస్య ఉన్న చోట నూతన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో వాటర్‌వర్క్స్ ఇన్స్పెక్టర్ రమేష్,, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.