Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్‌ను అవమానించి, నిమ్న జాతుల కమ్యూనిల్ అవార్డును ధ్వంసం చేసి మానవ హక్కులను కాలరాసిన గాంధీ కాంగ్రెస్ వారసుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ప్రపంచ మేధావి, పీడిత ప్రజల మానవ హక్కుల పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్-14తో కలిపి కేసిఆర్ సర్కార్ ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేయడం అంబేద్కర్‌ను అవమానించినట్లేనని దళిత బహుజన పార్టీ (డిబిపి) జాతీయ అధ్యక్షులు, హైకో ర్టు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఆరోపించారు. బుధవారం హిమాయత్‌నగర్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిమ్న జాతుల పౌరహక్కుల కోసం శ్రమిస్తున్న అంబేద్కర్ న్యాయకత్వాన్ని దెబ్బతీయడానికి బీహార్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు బాబు జాగ్జీవన్ రామ్‌ను తెర మీదకు ఆనాటి కాంగ్రెస్ నాయక త్వం తీసుకొచ్చిందన్నారు. కేంద్ర కేబినెట్లో పలుమార్లు కేంద్ర మంత్రి, ఉప ప్రధాని పదవులు జగ్జీవన్ రామ్ కు అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. అంబేద్కర్ స్థాయిని దెబ్బతీసి కేవలం దళిత నాయకుడుగా ముద్ర వేసి కుట్ర పూరితంగా కాంగ్రెస్ గాంధీ జపం చేసిన జాగ్జీవన్ రామ్ జయంతితో ముడిపెట్టి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఈ మనువాద పాలకులు ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్య సమితి (యుఎన్ఓ) చేత విశ్వ విజ్ఞానవంతుడిగా గుర్తుంపు పొందడమే కాకుండా ఆధునిక భారతవని నిర్మాణం కోసం ప్రధానంగా దేశంలోని మెజార్టీ ప్రజలు నిమ్న జాతుల మానవహక్కుల కోసం అంబేద్కర్ తన మొత్తం కుటుంబాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. అలాంటి త్యాగ యోధుడు అంబేద్కర్ స్థాయిని తగ్గించి ఆర్యజాతి మనువాద పాలకులకు, గాంధీ కాంగ్రెస్ కు జీవితాంతం జపం చేసిన జాగ్జీవన్ రామ్ తో సమానం చేసి చూడటం అంబేద్కర్ కు ద్రోహం చేయడమేనని ఆరోపించారు. అంబేద్కర్ జయంతిని ఏ నాయకుడితోనూ కలపకుండా ఆయన జయంతి దినోత్సవాలను గౌరవంగా, ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్, వైఎస్.జగన్ సర్కార్లను తమ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమా వేశంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరీ వసంత రావు, ప్రధాన కార్యదర్శి బీరం సతీష్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పరి సుబ్బారావు, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుల రాజలింగం, జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి కార్యదర్శి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎఫ్‌సిఐ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సి.యాదగిరి, పార్టీ ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.