Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈస్ట్ సిటీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మూడు దశాబ్దాలుగా తమకు అన్యాయం జరుగు తుందనీ, న్యాయం చేయాలని ప్రభుత్వానికి ఈస్ట్ సిటీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం భువనగిరి జిల్లా బీబీ నగర్లో ఒక ప్రముఖ రియల్టర్ యాజమాన్యంలో ఈస్ట్ సిటీ పేరుతో 2వేల ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టారనీ, అందులో ప్లాట్ల కోసం తాము 1989, 90లలో 300 మంది డిఫెన్స్‌లో పని చేస్తూ డిపాజిట్లు చెల్లించామన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సిటీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి మాట్లాడారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తా మని చెబితే తాము నమ్మకంతో ప్లాట్లు తీసుకున్నామనీ, ఇప్పటికి మూడు దశబ్దాలు గడుస్తున్నా సదరు రియల్టర్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. కొంతమంది పేరుపై ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినా ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. తమ ప్లాట్లు తమకు అప్పగించి, తమ స్థలాల్లో నిర్మాణం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు రవి గోలి, సూర్య నారాయణ, మాజీ బ్రిగేడియర్ కెఎస్.రావు, చంద్రశేఖర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.