Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలిలో భారత స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎండీ దాన కిశోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఆయన దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. అణగారిన వర్గాలు, కార్మికులకు హక్కులు కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. మనం సైతం ఎంతో మంది మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం పని చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు జలమండలి ప్రధాన కార్యాలయం నుంచి ఎల్బీ స్టేడియం వద్దనున్న జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీని ఎండీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమం డలి ఈఎన్సీ ఆపరేషన్స్ -1 డైరెక్టర్ అజ్మీరా కష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ -2 డైరెక్టర్ స్వామి, కార్యక్రమం కోఆర్డినేటర్, సీజీఎం విజయ రావు, సీజీఎంలు వినోద్ భార్గవ, అమరేందర్ రెడ్డి, ప్రభు, జీఎంలు, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలం గాణ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, అసోసియేట్ ప్రెసిడెం ట్ రాజిరెడ్డి, జలమండలి ఎస్సీ ఎస్టీ, బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.