Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
శారీరక దృఢత్వానికి వ్యాయామశాలలు ఎంతో ఉపయోగపడతాయని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు బుధవారం చిల్కానగర్ డివిజన్లోని బ్యాంక్ కాలనీలో బతు కమ్మ పార్కులో రూ. 18 లక్షలతో నూతనంగా నిర్మించబో తున్న బహిరంగ వ్యాయామశాలకుకార్పొరేటర్ బన్నాల గీత తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఇటు బీరప్ప గడ్డకు కాలనీలకు మధ్యలో కేంద్రంగా ఉన్న బ్యాంక్ కాలనీలోని బతుకమ్మ పార్కులో జిమ్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపయో గపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గౌతమ్ కుమార్, బద్దం భాస్కర్ రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, బజార్ జగన్,ఎదుల కొండల్ రెడ్డి, గడ్డం రవికుమార్, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, గరిక సుధాకర్, అబ్బో భారు, అశోక్ చారి,రామానుజన్, అలిబిలి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కార్పొరేటర్
చిల్కానగర్ డివిజన్ను దశలవారీగా అభివృద్ధి చేస్తా మని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత అన్నారు. బుధవారం చిల్కానగర్ డివిజన్లో ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అధికారితో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. చిల్కా నగర్, ఉప్పల్ ప్రధాన రహదారిలోని శ్రీనగర్ కాలనీ, కావేరి నగర్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా, శ్రీనివాస్ హైట్స్ నుండి కావేరి నగర్ కల్వర్టు వరకు నూతన సీవరేజ్ పైప్లైన్ పనులు పూర్తి అయిన సందర్భంగా రోడ్డు నిర్మాణపనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సీఆర్ఎంపీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు అన్నారు. పనులు జాప్యం చేస్తే, నాణ్యత పాటించకుంటే కాంట్రా క్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. చిల్కానగర్ డివిజన్లో దాదాపు అన్ని కల్వర్టు ల పనులు పూర్తి చేశామని, దశలవారీగా మిగతా పనుల న్నింటినీ కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ గౌతమ్ కుమార్ , బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బద్దం భాస్కర్ రెడ్డి , బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఏదుల కొండల్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి కోకొండ జగన్, గడ్డం రవికుమార్ ,గరిక సుధాకర్, అబ్బో భారు, అశోక్ చారి,బలరాం, రామానుజన్, ముద్దం శ్రీనివాస్, రవీందర్ గౌడ్, రామచందర్, బాలేందర్, యాదగిరి, పోచయ్య, సం తోష్, ఫోటో బాలు, శ్యామ్, రహమాన్ పాల్గొన్నారు.