Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మీర్పేట్
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం నాయకులు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మీర్ పేట్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పలు రాజకీయం పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పూలమా లలు వేసి నివాళులర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు పాండుగౌడ్, కేవీపీఎస్ అధ్యక్షుడు దాసరి బాబు, రాజలిం గం, బిక్షపతి, రజక సంఘం అధ్యక్షుడు బాల్ రాజ్, కార్పొ రటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు తదితరులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాగోల్ : కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్ అని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.ఎల్.బి.నగర్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళ్లర్పించారు. రామ్ కోటి, వెంకట్ గౌడ్, లోకేష్, శ్రీనివాస్, కౌశిక్, దళిత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ : బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మి ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వద్ద ఉన్న బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి,బీజేపీ అర్బన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి , పల్లె గణేష్ గౌడ్, ఎండీ జానీమియా , ఆడాల రమేష్, పోచబోయిన జగదీష్ యాద వ్, తూర్పాటి చిరంజీవి, గాలెయ్య , సరస్వతి , సిలిమర్తి శేఖర్, మల్లెపాక యాదగిరి, పల్లె గణేష్ గౌడ్ , శ్యామల యాదగిరి, ఉపేందర యాదవ్ తదితరులున్నారు.
దళిత బహుజన సంఘాల నాయకులు పారంద స్వామి,ఎర్ర రవీందర్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతిని హయత్ నగర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహిం చారు. కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి,టీపీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్,మాజీ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి,గజ్జి శ్రీనివాస్ యాదవ్,బండారి భాస్కర్, రమేష్,డప్పు నాగేష్,లచ్చు మల్ల వెంకన్న,కడారి పెంటయ్య దళిత నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్ : ఎల్బీనగర్లో జయంతి సందర్భంగా విగ్రహనికి కాంగ్రెస్ ఎల్బీనగర్ ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్బంగా మల్ రెడ్డి రాం రెడ్డి మాట్లాడుతూ రాజకీయ వేత్త, దళిత తొలి ఉప ప్రధాని బాబు డా.బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. పేద దళిత కుటుంబంలో పుట్టి దళితుల హక్కుల సాధనకు అవిరామ కషిచేసిన సంఘసం స్కర్త అన్నారు. పదవి వచ్చిన అతి కొద్ది కాలంలో అక్రమంగా సంపాదిస్తూ కోట్లకు పడగలు ఎత్తుతున్న నాయకులు నేటి సమాజం లో ఉన్నారన్నారు.50 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి ఉప ప్రధానిగా పనిచేసిన కూడా ఎలాంటి ఆస్తిని కూడబెట్టుకొని ఉన్నతమైన వ్యక్తి డా.బాబు జగ్జీవన్ రామ్ అన్నారు. పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, రమేష్ నాయక్, మంజుల రెడ్డి, సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జానీ బాబా, కిరణ్, యాదగిరి, భాను తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ జయంతి చైతన్యపురి అంబేద్కర్ నగర్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించి వారికి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా కేవీపీఎస్ నాయకులు గంధం మనోహర్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవీపీఎస్ సరూర్నగర్ సర్కిల్ కార్యదర్శి ఎం కష్ణ, సీఐటీయూ కన్వీనర్ ఎం వీరయ్య, మత్స్యకారుల సంఘం నాయకులు సిహెచ్ వెంకన్న , చెన్నారం మల్లేష్ ,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల చౌక్ వద్ద నిర్వహించిన జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొని వారి విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ముడుపు సందీప్ రెడ్డి, ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు జగన్మోహన్, రాజు, శేఖర్, పవన్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
సరూర్ నగర్ : దేశంలోని సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత బాబు జగ్జీవన్ రామ్ అని కామన్ మ్యాన్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఫౌండర్ ప్రెసిడెం ట్ సంఘటి ప్రసాద్ అన్నారు. ఆర్కె పురంలోని బాబు జగ్జీవన్ రావు భవనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎర్రన్న, ఖలీల్, అశోక్ గౌడ్, శాంతిరాజ్, పుట్ట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ మహేశ్వ రం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరవింద శర్మ మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం తన జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత అని అన్నారు. షాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నెంటూరి రవీందర్ రెడ్డి, బేర బాలకిషన్, కొండ్ర శ్రీనివాస్, బీరెల్లి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రామాచారి, ఎస్కే మహమ్మద్, శేఖర్ ,మాధవి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట్ : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డిలు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ వసంత ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మార్పీ ఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. మున్సిపల్ కమిషనర్ వసంత, 16వ వార్డు కౌన్సిలర్ యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు శివకుమార్, దానయ్య, వినోద్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురం : కార్పొరేటర్ బి సుజాతా నాయక్, బి.ఆర్.ఎస్ హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు ఆందొజ్ సత్యం చారి, మాజీ కార్పొరేటర్ ఆర్.పద్మ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ సీని యర్ నాయకులు జి. చంద్రశేఖర్ రెడ్డి, రామ్ చందర్ నాయ క్, సాల్వచారి, శ్రీ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ : బీజేపీ నాగోల్ డివిజన్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ మోర్చా డివిజన్ అధ్యక్షులు మైనం రాజేశ్వరి అధ్యక్షతన ఘనంగా నిర్వహిం చారు. బీజేపీ నాగోల్ డివిజన్ సీనియర్ నాయకులు చింతల సురేందర్ నాథ్ యాదవ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్దం బాలకష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.