Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాల్టీ బౌరంపేట్ సింహపురి కాలనీ పరిధిలో 19వ వార్డ్ పార్క్ అభివద్ధి, డ్రైనేజీ సమస్యపై కాలనీవాసులు ట్వీట్ చేయగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఎమ్మెల్యే కె.పి వివేకానంద, దుండిగల్ కమిషనర్ సత్యనారాయణతో కలిసి ప్రజల సమస్యాత్మక డ్రైనేజ్, పార్కు అభివద్ధిని పరిశీలిం చారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు చర్యలు చేపట్టి పరిష్కరించడంతో అరగంటలో స్పందించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ పనితీరు పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 ఎకరాల వెంచర్ కావడం, సరైన డ్రైనేజీ ఔట్ లెట్ లేకపోవడంతో మురుగునీరు కొంత పార్క్‌లో, పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలంలో ఆగడంతో తక్షణమే స్థానిక కమిషనర్‌కు ఆదేశాలిచ్చి మురుగు నీటిని ట్యాంకర్ల ద్వారా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోని అదేవిధంగా పార్క్ పక్కనే ఉన్న ప్రైవేట్ స్థలం యజమానితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించగలిగామని, మంత్రి కేటీఆర్ సహకారంతో అవసరమైన నిధులు ప్రత్యేకంగా మంజూరు చేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అతి త్వరలోనే వివేకానంద పార్క్‌లో లైట్లు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలనీవాసు లకు మాటిచ్చారు. అనంతరం అరగంటలో స్పందించిన ఎమ్మెల్యేకు ప్రజలు కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ మాధవి, సీనియర్ నాయకులు మురళి యాదవ్, కొలన్ శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కాలనీవాసులు, దేవేందర్‌రెడ్డి, దశరథ్, సందీప్‌రావు, ఆంజనేయులు, రవీందర్‌రెడ్డి, మనివర్ధన్, వినోద్, అనిల్, కిషోర్, అరవింద్, రోహిత్, శ్యామ్, బాలిరెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.