Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ యువ నాయకుడు అత్వెల్లి సందీప్గౌడ్
నవతెలంగాణ-మేడ్చల్
సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని మేడ్చల్ మున్సిపాల్టీ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు అత్వెల్లి సందీప్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డుకు చెందిన మొహమ్మద్ ఫరీన్కు మంజూరైన రూ.28వేలు, మల్లేష్ రూ.25వేలు, జయమ్మకు రూ.30వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ గౌడ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్న వారికి, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ రమేష్, కౌన్సిలర్ స్వామి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మధుకర్ యాదవ్, 17వ వార్డు అధ్యక్షుడు నాచారం మహేష్ యాదవ్, సాయి కమల్, మైనారిటీ అధ్యక్షుడు లాయక్ అలీ, ఆటో యూనియన్ నాయకులు ఎర్ర విజరురావు తదితరులు పాల్గొన్నారు.