Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కూకట్పల్లి
పేద ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని టీటీడీి బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు బీజేపీి సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఉదయం 9గం నుండి కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఏవీబీపురంలో కేబికే హాస్పిటల్స్ వారి సౌజన్యం తో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాయనేని సూర్యప్రకాశరావు, అద్వానీ సూర్యారావు, శ్రీనివాసగౌడ్, కట్ట శంకర్రెడ్డి, సంతోష్, విశాల్, భాస్కర్, కష్ణప్రియ, కల్పన, సాయికుమార్, ఈశ్వర్, అరవింద్ నాయుడు, అక్కినపల్లి సాయి, నరేందర్ రెడ్డి, వినరు, నాగరాజు మరియు పెద్ద ఎత్తున కూకట్పల్లి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.