Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
భావితరాలకు నేటి విద్యార్థులే దిక్సూచి అని, విద్యార్థులు చిన్ననాటి నుంచి పట్టుదలతో చదివితే తప్పక ఉన్నతులుగా ఎదుగుతారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజరుపురి కాలనీలో గల వైష్ణవి టెక్నో స్కూల్ 11వ వార్షికోత్సవ వేడుకలు విద్యార్థినీ విద్యార్థుల కేరింతల నడుమ ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్, మేడ్చల్ జిల్లా ట్రస్మ అధ్యక్షులు కె.రామేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు బిర్రు ఆంజనేయు లు, ప్రముఖ సైక్రియార్టిస్ట్ సుధీర్ సండ్రా, బలగం సినిమా దర్శకులు వేణు, పాఠశాల చైర్మెన్ సి.హెచ్.నర్సింహులుగౌడ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనతోపాటు క్విజ్, వ్యాసరచన, చదువులో, సాంస్కతిక ప్రదర్శనలో, క్రీడల్లో, అటెండెన్స్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటో లను ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా గత సంవత్సరం పదవ తరగతిలో జీపీిఏ 10/10 సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భం గా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న యజమాన్యాన్ని అభినం దించారు. విద్యతోనే సమాజంలో విద్యార్థులు విలువలతో కూడిన జీవన విధానంతో ఎదుగుతారన్నారు. చదువు ఎంత ముఖ్యమో సంస్కారము అంతే ముఖ్యమన్నారు. అనంతరం ప్రముఖ సైక్రియార్టిస్ట్ సుధీర్సండ్రా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్‌లో ఎదగడానికి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్ పి.శివయ్య, రావుల వరప్రసాద్, దయాకర్, గడ్డమీది బాలరాజ్‌గౌడ్, పాఠశాల ప్రిన్సిపల్ శిల్ప, పాఠశాల ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.