Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్‌లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఓ ఘరానా ముఠా పట్టుబడింది. అక్రమ డబ్బు సంపాదన ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫేక్ కాల్ సెంటర్ నడుపుతూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న 13 మందిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. ఆస్ట్రేలియా సిటిజన్స్ డేటాను ఆన్లైన్లో కనుక్కొని వారి ఫోన్లకు ఫోన్ చేసి సైబర్ మోసాలకు పాల్పడుతు న్నారు. పక్కా సమాచారంతో ఫేక్ కాల్ సెంటర్ పై మేడ్చల్ ఎస్ఓటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు దాడులు నిర్వహిం చారు. ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్న 13 మంది నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీసులకు అప్పగిం చారు. కేసులు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం చారు. మేడ్చల్ జోన్ డీసీపీి సందీప్‌రావు, అమెజాన్ ప్రైమ్, సబ్స్క్రిప్షన్స్, ఇంటర్నెట్ స్పీడ్ సమస్య అంటూ పంపించే మెసేజ్‌లు ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వారి వద్ద నుండి 13 డెస్క్‌టాప్ మానిటర్స్, 14 సీపీయూలు, 13 హెడ్ ఫోన్లో, ఒక హార్డ్ డిస్క్, ఒక ఫ్రెండ్ డ్రైవ్, 8 సిమ్ కార్డులు 18 మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నామన్నారు. ప్రధాన నిర్వాహకుడు ప్రమోద్ రెడ్డితో పాటు మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నమని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు.